తానైతే భారత ప్రధాని నరేంద్ర మోడీతో భారతదేశంలో ముస్లిం మైనార్టీల పరిస్థితి, హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడి ఉండేవాడినని అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. భారత ప్రధానితో అధ్యక్షులు బైడెన్ దాచి దాచనట్లుగా హక్కుల విషయం ప్రస్తావిస్తే లాభం లేదన్నారు. ప్రస్తుత దశలో భారతదేశంలో హక్కుల విషయం ప్రస్తావిస్తే భారత్తో సంబంధాలు బెడిసి కొడుతాయని బైడెన్ భావించి ఉంటారని, అయితే తానైతే ప్రధాని మోడీకి మతపరమైన స్వేచ్ఛను కాపాడకపోతే సంబంధాల విషయంలో ఆలోచించుకోవల్సి ఉంటుందని చెప్పేవాడినని తెలిపారు. తనకు మోడీ బాగా తెలుసునని , ఇండియాలో ఎటువంటి అపశృతిపై అయినా ఆయనతో నిర్మొహమాటంగా మాట్లాడి, దారి తప్పకుండా చేసే వాడినేమో అని ఒబామా తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-222.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-221.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-222.jpg)