బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా పెన్నుల వివాదంలో చిక్కారు. సాధారణంగా రిషి చెరిగిపొయే ఇంక్‌తో కూడిన పెన్నులు వాడుతారు. దీనితోనే అధికారిక పత్రాలపై తన నోట్స్ పెడుతారు. అయితే దీని వల్ల ప్రభుత్వ అధికారిక సమాచార భద్రతకు భంగం వాటిల్లుతుంది. ప్రత్యేకించి ప్రధాని అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ సంబంధిత అత్యంత గోప్యతకు ప్రధాని స్వయంగా అనుకోకుండానే భంగం కల్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం అయింది. ప్రధాని సునాక్ తరచూ వాడిపారేసే పైలట్ వి పెన్నులు వాడటం జరుగుతున్న విషయాన్ని తెలిపే ఫోటోలను కూడా పత్రిక ప్రచురించింది.చెరిపివేయడానికి వీలైన సిరాతో ఉండే పెన్నులతో ఆయన రాసే అధికారికసూచనలను తొలిగించేందుకు వీలుంటుంది. లేదా ప్రభుత్వ కార్యకలాపాలను తరువాతి క్రమంలో అవసరం కోసం అయినా పరిశీలించేందుకు వీల్లేకుండా పోతుందని నిర్థారణ అయింది.
ప్రధాని వాడే ఈ రకం పెన్నుల విలువ భారతీయ కరెన్సీలో అయితే రూ 495 వరకూ ఉంటుంది. బ్రిటన్‌లో దీని ధర ఒక్కంటికి 4.75 పౌండ్లు. కేవలం దస్తూరీ బాగుపడేందుకు ఈ రకం పెన్నులు వాడుతారు. ఈ పెన్నుల వివాదంపై ప్రధాని కార్యాలయ వర్గాలు స్పందించాయి. ఈ పెన్నులను ఎక్కువగా సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులు వాడుతారని, వీటిని ప్రధాని కార్యాలయానికి వీరే సమకూరుస్తారని తెలిపారు. పైగా ప్రధాని ఎప్పుడు కూడా రాసింది తీసివేత పనికి వెళ్లలేదు, వెళ్లబోరని ఆయన తరఫున ప్రెస్ సెక్రెటరీ వివరణ ఇచ్చారు.