క్వీన్ ఆఫ్ పాప్‌గా ప్రఖ్యాతిగాంచిన మడోన్నా (64) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.గత శనివారం మడోన్నా ఇంట్లో అచేతన స్థితిలో పడి ఉన్నారు. దీంతో ఆమెను న్యూయార్క్‌లోని ఓ ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం మడోన్నా ఐసీయూలో ఉన్నారు. పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నా, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది అని అన్నారు.