ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్, హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బలగం. ఈ చిత్రానికి వేణు ఎల్దండి దర్శకుడు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణలోని గడప గడపను పలకరించి తెలుగు ప్రేక్షకులతో పాటు భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను హత్తుకున్న తెలంగాణ మట్టికథ, సున్నితమైన భావోద్వేగాలతో అందరి గుండెలను పిండేసిన తెలంగాణలోని ప్రతి కుటుంబ కథ బలగం.
తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడి 100కిపైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. బలగం సినిమా అంతర్జాతీయంగా 100 అవార్డులను సొంతం చేసుకోవడంపై మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదొక అద్భుతమైన మరుపురాని ప్రయాణం. ఇది వరకు మన సినిమాలు 100 కోట్లు, 100 రోజులు, 100 సెంటర్స్, వంటి రికార్డులు సాధించాయి. ఇప్పుడు 100 అంతర్జాతీయ అవార్డులను సాధించడంతో బలగం సినిమా ప్రత్యేక చిత్రంగా నిలిచింది అన్నారు.