తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు ఆర్థిక సహాయం చేసినందుకు శ్రీలంక పార్లమెంటు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. కొలంబోలోని ఇండియన్ ట్రావెల్ కాంగ్రెస్ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన ఒక పార్టీలో ఆయన మాట్లాడుతూ న్యూఢిల్లీ కొలంబో కు సన్నిహిత సహచరుడని, విశ్వసనీయ స్నేహితుడని అభివర్ణించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తమను భారత్ రక్షించింది. లేనట్లయితే తామందరికి మరో రక్తపాతం ఉండేదని చెప్పారు. సాంస్కృతికంగా, జాతీయంగా, విధానపరంగా శ్రీలంక, భారత్ ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయని తెలిపారు. అన్నింటికంటే ప్రధానంగా భారతదేశం శ్రీలంకకు చాలా సన్నిహిత సహచరుడని, అత్యంత నమ్మదగిన మిత్రుడని చెప్పారు. తమ దేశంలో ఇబ్బందుల్లో ప్రతిసారి భారత్ సహాయం అందిస్తున్నదని గుర్తుచేశారు.


