బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జవాన్. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే జవాన్ ట్రైలర్‌ను మిషన్ ఇంపాజిబుల్ సినిమా థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్, తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ట్రైలర్ ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడు కావటం విశేషం. యాక్షన్ ఎలిమెంట్స్, నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో కూడిన జవాన్ ట్రైలర్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


