కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం బెదురులంక 2012. క్లాక్ దర్శకుడు. నేహాశెట్టి కథానాయిక. యువరాజ్ సమర్పణలో రవీంద్రబెనర్జీ (బెన్నీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రాబోతున్న డ్రామెడీ( డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ఈ చిత్రం ఉంటుంది. ఓ కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతారు అన్నారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో మా చిత్రానికి సంబంధించిన కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. కార్తికేయ, నేహా శెట్టి జోడీ మధ్య కెమిస్ట్రీ, ద వరల్డ్ ఆఫ్ బెదురులంక, మిగతా క్యారెక్టర్లు, పాటలు మరియు గోదావరి ఒడ్డున లొకేషన్లు అన్నీ మీకు చాలా నచ్చుతాయి. ఒక కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతి తో పాటు సినిమా అంతటా నవ్వుతూనే ఉంటారు అని చెప్పారు. ఆగస్టు 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్‌ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.

