వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడు. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్ పూర్తి మాస్ పాత్రలో కనిపిస్తారు. గ్రామీణ నేపథ్యంలో ఓ గుడి చుట్టూ అల్లుకున్న కథాంశమిది. తన వారి క్షేమం కోసం ఓ యువకుడు ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. పవర్‌ఫుల్ యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా అన్ని వర్గాలను మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. అపర్ణా దాస్, జోజు జార్జ్, రాధిక తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఆయన విలన్ రోల్ చేశారు. ఆగస్ట్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డడ్లీ, సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి.


