Namaste NRI

ఫిలడెల్ఫియాలో ఘనంగా ప్రారంభమైన తానా మహాసభలు

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో  తానా  మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్‌ హాల్‌లో మూడు రోజులపాటు జరుగనున్న ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. అక్కడికి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎవరు ఎక్కడ ఉన్నా ఎన్‌ఆర్‌ఐలు సహా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని చెప్పారు. తాను ఈ సభలకు ప్రతి ఏడాదీ హాజరవుతున్నానని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. ప్రవాస భారతీయులు అందరికీ మహా సభల శుభాకాంక్షలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events