ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. హీరో రామ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఛార్మి క్లాప్‌నిచ్చారు. తొలి సన్నివేశానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇస్మార్ట్ శంకర్ ఆలియాస్ డబుల్ ఇస్మార్ట్ అంటూ రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఈ నెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించబోతున్నామని చిత్ర బృందం పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


