నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి టైటిల్ రోల్స్లో నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన టీజర్, పోస్టర్లతోపాటు నో నో నో, హతవిధి సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఇటీవలే మేకర్స్ లేడీ లక్ ప్రోమోను లాంఛ్ చేయగా, తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

నవీన్ పొలిశెట్టి, అనుష్కను ఫాలో అవుతూ పాడుకుంటున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రాధన్ కంపోజిషన్‌లో కార్తీక్ పాడాడు. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి సోలో లైఫ్ లీడ్ చేస్తున్న మిస్టర్ పొలిశెట్టి, మిస్ పొలిశెట్టి మధ్య సాగిన ఫన్నీ లవ్ ట్రాక్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే లాంఛ్ చేసిన టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.

ఇప్పటికే లాంఛ్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫస్ట్ లుక్‌లో అనుష్క హ్యాపీ సింగిల్ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఊహల్లో విహరిస్తున్నట్టు కనిపిస్తుండగా, మరోవైపు నవీన్ పొలిశెట్టి గోడపై కూర్చొని హ్యాపీ మూడ్‌లో ఛిల్ అవుట్ అవుతున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 4న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
