Namaste NRI

విడుదలకు ముందే సలార్‌ సరికొత్త రికార్డు

 ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న సలార్‌-1. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మిస్తున్నారు. శృతిహాసన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ  చిత్రంపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని మెప్పించింది. విదేశాల్లో కూడా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  తాజాగా ఈ సినిమా ఓవర్‌సీస్‌ రిలీజ్‌ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఉత్తర అమెరికాలో 1979కి పైగా కేంద్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇక విదేశాల్లో ఐదువేలకు పైగా థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతున్నది.ఈ సినిమా యు.ఎస్‌. ప్రీమియర్‌ షోలను సెప్టెంబర్‌ 27న ప్రదర్శించనున్నారు. దక్షిణ అమెరికాలో 1979కి పైగా కేంద్రాల్లో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా సలార్‌-1 సరికొత్త రికార్డును సృష్టించిందని ఈ సినిమా ఓవర్‌సీస్‌ రిలీజ్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంస్థ  పేర్కొంది.  సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events