Namaste NRI

బ్లడ్ అండ్ చాక్లెట్ ట్రైల‌ర్ రిలీజ్

అర్జున్‌ దాస్‌, దుసరా విజయన్‌ జంటగా నటిస్తున్న చిత్రం బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌. ప్రముఖ దర్శకుడు శంకర్‌ నిర్మాణ సంస్థ ఎస్‌.కె.పిక్చర్స్‌ పతాకంపై వసంత బాలన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్నది. తెలుగులో ఎస్‌ఆర్‌డీఎస్‌ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నది. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.దర్శకుడు మాట్లాడుతూ లవ్‌, ఎమోషన్స్‌తో పాటు అన్ని కమర్షియల్‌ అంశాలను మేళవించి రూపొందించిన చిత్రమిది. జీవీ ప్రకాష్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు. తప్పకుండా ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత దేవసాని శ్రీనివాస రెడ్డి తెలిపారు.

హీరోయిన్ దుస్సారా విజయన్ మాట్లాడుతూ నేను తమిళంలో చేసిన సారపట్టా పరంపర సినిమా తమిళంలో చాలా పెద్ద హిట్ అయ్యింది. అర్జున్ చాలా మంచి కోస్టార్. వ‌నితా విజ‌య్ కుమార్‌గారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం హ్యాపీ. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.హీరో అర్జున్ దాస్ మాట్లాడుతూ నేషనల్ అవార్డ్ గెలుచుకున్న వసంత బాలన్‌గారితో క‌లిసి ప‌ని చేయ‌టం మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌. దుస్సారా విజ‌య‌న్‌గారికి థాంక్స్‌. సినిమాలో వ‌ర్క్ చేసిన వ‌నితా విజ‌య్ కుమార్‌గారు స‌హా ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కి థాంక్స్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events