Skip to main content

Namaste NRI

ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం : ప్రియా ప్రకాశ్‌

పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం బ్రో.  కథానాయిక ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఈ చిత్రానికి పి.సముద్రఖని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత.  ఈ నేపథ్యంలో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మాట్లాడుతూ కెరీర్‌ ప్రారంభంలోనే పవన్‌కల్యాణ్‌ లాంటి గొప్ప నటుడితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలో ఆయన కాంబినేషన్‌లో నాకు సన్నివేశాలున్నాయి. ఆయన తన నటనతో మ్యాజిక్‌ చేస్తారు. గత చిత్రాలతో పోలిస్తే నేను ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తాను. ఇందులో నా పాత్ర పేరు వీణ. హోమ్లీ గర్ల్‌ లాంటి పాత్ర. తప్పకుండా ఈ చిత్రం నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. మాతృకతో పోలిస్తే బ్రో సినిమాలో చాలా మార్పులు చేశారు. పవన్‌కల్యాణ్‌ గారి ఇమేజ్‌కు తగ్గట్టుగా, సినిమాలో సోల్‌ మిస్‌ అవ్వకుండా మార్పులు చేశారు. చాలా కొత్త సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఇదొక మంచి కుటుంబ కథా చిత్రం. అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. నా కెరీర్‌ ఇప్పుడు సరైన దిశగా ప్రయాణిస్తున్నది. పాత్రలు, సినిమాల ఎంపిక విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు గొప్ప నటి కావాలని ఆశ ఉండేది. ఆ దిశగానే నా అడుగులు సాగుతున్నాయి అని చెప్పింది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News