హీరో కార్తీకేయ – నేహా శెట్టి జంటగా అలరించబోతున్న చిత్రం బెదురులంక 2012. క్లాక్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ఈ చిత్రంలోని సొల్లుడా శివ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. భోగమంత యిడువవు వింతగుంది రా నువెవడివి సొల్లుడా శివా నువెవడివి సొల్లుడా శివ అంటూ సాగే ఈ గీతానికి మణిశర్మ సంగీతం అందించారు. కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, పృథ్వీ చంద్ర ఆలపించారు. నిర్మాత మాట్లాడుతూ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ఇది. గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా వుండే సినిమా ఇది అన్నారు. చిత్రంతో మునుపెన్నడూ లేని వింతలు, విడ్డూరాలతో అలరించేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఆగస్టు 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన బాణీలు అందిస్తున్నారకు. ఓ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించడం విశేషం.
