ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందుతున్న సినిమా ప్రాజెక్ట్-K. ఈ సినిమా బడ్జెట్ ఆరోందల కోట్లకు పైమాటే అని తెలుస్తుంది. రాను రాను ఈ నెంబర్ పెరుగుతుండచ్చు అన్నది కూడా ఓ సమాచారం. ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న మూవీ ప్రాజెక్టు K . సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ చేస్తున్న ఫస్టు సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇందులో ప్రభాస్ జోడీగా దీపిక పదుకొణె నటిస్తోంది. సైంటిస్ట్ గా అమితాబ్ కనిపించనుండగా తినాయకుడి పాత్రను కమల్ పోషిస్తున్నారు. తాజాగా భాస్ ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అవెంజర్స్ తరహాలో ఒక డిఫరెంట్ లుక్ తో ప్రభాస్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.