టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో సమావేశమయ్యారు. బ్రిటన్‌లో గ్లోబల్ బ్యాటరీ సెల్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రిషి సునాక్‌ను చంద్రశేఖరన్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. బ్రిటన్‌లోని వార్‌విస్క్ షైర్‌లో గల జాగ్వార్ లాండ్ రోవర్ గాయ్డన్ సెంటర్‌లో వీరు కలుసుకున్నారు. టాటా కంపెనీ 400 కోట్ల పౌండ్లపై చిలుకు (రూ.42 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నది. యూరప్ లోనే ఇది అతిపెద్ద ఫ్యాక్టరీ కానున్నది. గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని టాటా సన్స్ ప్రకటించడం బ్రిటన్‌లోని ఆటోమోటివ్ రంగంలో అతిపెద్ద పెట్టుబడి అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వ్యాఖ్యానించారు.
