Namaste NRI

సౌత్ ఆఫ్రికాలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

సౌత్ ఆఫ్రికాలో  తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి  కేటీఆర్ జ‌న్మదిన వేడుక‌ల‌ను టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం  నాగరాజు  మాట్లాడుతూ కేటీఆర్‌ నాయకత్వంలో ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని సాధిస్తోందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.  ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కోర్ కమిటీ సభ్యులు హరీష్ రంగా, వెంకట్ రావు, శ్రీనివాస్ రేపాల, సౌజన్ రావు,  వెంకట్ రెడ్డి నల్లగుండ్ల, నవదీప్ రెడ్డి, సాయి కిరణ్ నల్ల, కిరణ్ కుమార్ బెల్లి, రంజిత్ కుమార్, నామా రాజేశ్వర్  పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News