లింగ మార్పిడి సర్జరీలు, చికిత్సపై రష్యా నిషేధం విధించింది. సెక్స్ చేంజ్‌ను బ్యాన్ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై దేశాధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. ట్రాన్స్‌జెండర్ పరిశ్రమ కట్టడి కోసం పుతిన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది . ఇన్నాళ్లూ లీగల్‌గా జరిగిన లింగ మార్పిడిని ఇప్పుడు బ్యాన్ చేశారు. ఏవైనా సీరియస్ మెడికల్ కేసులు తప్పితే మరే కేసుల్లోనూ లింగ మార్పిడిని అంగీకరించేదిలేదని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది. డ్రగ్స్ వాడరాదని, సర్జరీలు చేయరాదని కొత్త చట్టం చెబుతోంది. లైసెన్సు పొందిన క్లినిక్‌లు మాత్రమే లింగ మార్పిడి చికిత్స కోసం అనుమతి ఇస్తాయని రష్యా ఆరోగ్యశాఖ తెలిపింది. ఐడీలపైన కానీ, ఇతర డాక్యుమెంట్లపై కానీ, ప్రజలు తమ లింగాన్ని ఫ్రీగా మార్చుకోరాదని కొత్త బిల్లులో సూచించారు.
