Skip to main content

Namaste NRI

దుల్కర్‌ సల్మాన్‌ కింగ్‌ ఆఫ్‌ కోతా నుంచి హల్లా మచారే

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా చిత్రం కింగ్‌ ఆఫ్‌ కోతా. అభిలాష్‌ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని హల్లా మచారే అనే గీతాన్ని విడుదల చేశారు. జేక్స్‌ బిజోయ్‌ స్వరపరచిన ఈ పాటను ఎల్‌.వి.రేవంత్‌, సింధూజ ఆలపించారు. కృష్ణకాంత్‌ సాహిత్యాన్నందించారు.హుషారెత్తించే బీట్‌తో ఈ పాట ఆకట్టుకుంది. కోతా అనే ప్రదేశంలో జరిగే కథ ఇది. గ్యాంగ్‌స్టర్స్‌ ఆధిపత్య పోరు నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. దుల్కార్‌ సల్మాన్‌ పూర్తి మాస్‌ రోల్‌లో కనిపిస్తారు అని చిత్రబృందం పేర్కొంది. తొలిసారి గ్యాంగ్‍స్టర్‌గా నటిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మలయాళంలో రూపొందుతున్న కింగ్ ఆఫ్ కోటా సినిమా తెలుగు, హిందీ, తమిళంలోనూ విడుదల కానుంది.  ఐశ్వర్యలక్ష్మి, నైలా ఉష, చెంబన్‌ వినోద్‌, గోకుల్‌ సురేష్‌, షమ్మి తిలకన్‌ తదితరులు చిత్ర తారాగణం.

Social Share Spread Message

Latest News