ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అమెరికా సొంతం. కానీ, అటువంటి పరికరాల్లో చైనా టైంబాంబు పెట్టినంత పనిచేసింది. ఓ అజ్ఞాత మాల్వేర్ను అమెరికా పరికరాల్లోకి చొప్పించినట్లు సీనియర్ సైనికాధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ కాంగ్రెస్ అధికారి ధ్రువీకరించారు. చైనా హ్యాకర్లు, ఒక చిన్న కంప్యూటర్ కోడ్ను అమెరికా రక్షణశాఖ పరికరాల్లోకి చొప్పించినట్లు అనుమానిస్తున్నారు. ఇది సైన్యానికి చెందిన నెట్వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, సైనిక స్థావరాలకు నీటి సరఫరా వ్యవస్థల్లో ఇది ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో హ్యాకర్లు సంక్షోభ సమయంలో అమెరికా సైన్యానికి సరఫరాల్లో అంతరాయం కల్పించే ప్రమాదముంది.














