Namaste NRI

చంద్రముఖి 2 నుంచి స్వాగతాంజలి లిరికల్ సాంగ్

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్  రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ చంద్రముఖి 2. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోంది. సీనియర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల‌తో పాటు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తోంది. సుభాస్క‌ర‌న్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుంచి స్వాగ‌తాంజ‌లి అనే లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంగనా రనౌత్ అభరణాలను ధరించి రాజనర్తకి చంద్రముఖిలా డాన్స్ చేయటాన్ని చూడొచ్చు. ఇక సినిమా కోసం వేసిన సెట్స్, కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కాస్ట్యూమ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఎం.ఎం.కీర‌వాణి సంగీత సార‌థ్యంలో పాట విన‌సొంపుగా ఉంది. శ్రీనిధి తిరుమ‌ల పాడిన ఈ పాట‌ను చైత‌న్య ప్రసాద్ రాశారు. దర్శకుడు మాట్లాడుతూ తాజాగా విడుదల చేసిన ఈ పాటను శ్రీనిధి తిరుమల పాడగా, చైతన్య ప్రసాద్‌ సాహిత్యం అందించారు. ఈ పాటలో రాజనర్తకి చంద్రముఖిలా కంగనా చేసే డ్యాన్స్‌ అలరిస్తుంది. వినాయకచవితికి ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు. వడివేలు, లక్ష్మీమీనన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events