కౌశిక్‌బాబు, శాన్వీ మేఘన జంటగా నటించిన చిత్రం నేనే సరోజ. శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను శాసన సభ్యులు ముఠా గోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకులు శ్రీమాన్ గుమ్మడవెల్లి మాట్లాడుతూ “ఆడపిల్లల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్షత చూపేవారికి తాగిస్తం కారంచాయ్ అంటూ గుణపాఠం చెబుతుంది ఈ చిత్రంలోని హీరోయిన్ సరోజ. మంచి కంటెంట్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా కుటుంబ సమేతంగా చూసే చిత్రమిది అని అన్నారు. రచయిత, నిర్మాత డా సదానంద్ శారద మాట్లాడుతూ వరంగల్ కోట వంటి ఆహ్లాదకరమైన చారిత్రక ప్రదేశాలు, హృద్యమైన సంగీతం, ఆలోచనాత్మక సంభాషణలు, శాన్వి మేఘన వీరోచిత పోరాటాలు, ఆర్.యస్.నంద హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రచయిత, నిర్మాత డా.సదానంద్ శారద, దర్శకులు శ్రీమాన్ గుమ్మడవెల్లి, సంగీత దర్శకులు రమేశ్ ముక్కెర తదితరులు పాల్గొన్నారు.














