Namaste NRI

లాపటా లేడీస్ టీజ‌ర్ విడుద‌ల

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌ ప్రోడ‌క్ష‌న్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండ‌గా.. త‌న మాజీ భార్య కిర‌ణ్ రావ్ లాపటా లేడీస్ అనే మూవీకి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. కాగా, ఈ మూవీకి అమీర్‌ ఖాన్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. ఇక మూవీకి సంబంధించిన‌ ఫ‌స్ట్ లుక్ ఇటివ‌లే విడుద‌ల చేయ‌గా,  ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది. కొత్త‌గా పెళ్లి అయిన ఓ జంట ట్రైన్‌లో వెళుతుండగా, త‌న భార్య మిస్ అవుతుంది. ఇక ట్రైన్‌లో కొత్త పెళ్లికూతురు ఎలా మిస్స‌యింది? ఆ త‌ర్వాత ఏర్ప‌డిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమా రానుంది. ఇక  జమ్తారా వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ మూవీలో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ మూవీ 2024 జ‌న‌వ‌రి 5న థియేట‌ర్లలో రిలీజ్ కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events