Skip to main content

Namaste NRI

మెగా 157 ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ

టాలీవుడ్  మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వశిష్ట దర్శకత్వంలో ప్రకటించిన మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం మెగా 157 అభిమానుల మెగా సెలబ్రేషన్స్‌ను రెట్టింపు చేసింది. పంచభూతాలతో కూడిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. చిత్ర దర్శకుడు వశిష్ట సినిమా ప్రీ -ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఛోటా కె. నాయుడు ఈ చిత్రానికి కెమెరామెన్‌గాగా పని చేస్తారని తెలియజేశారు. మెగా 157  ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించాం. త్వరలో మీ అందరినీ సినిమాటిక్ అడ్వంచర్‌కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అని ట్వీట్ చేసిన వశిష్ట మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత, డీవోపితో కలసివున్న ఫోటోని షేర్ చేశారు.

Social Share Spread Message

Latest News