వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా లీడ్ రోల్ లో నటించిన వెబ్ సిరీస్ అతిథి. ఈ వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరించారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19 నుంచి అతిథి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వైజీ భరత్ మాట్లాడుతూ ఒక చిన్న పాయింట్ తో చిన్న ప్రాజెక్ట్ గా చేయాలనుకున్నాను. అయితే క్రమంగా నేను అనుకున్నదానికంటే చాలా ఎక్కువ బడ్జెట్ వెబ్ సిరీస్ అయ్యింది. ప్రవీణ్ సత్తారు గారిని ఒక సినిమా స్క్రిప్ట్ రైటింగ్ కోసం కలిసినప్పుడు ఈ పాయింట్ చెప్పాను. ఆయనకు నచ్చి ప్రాజెక్ట్ మొదలైంది. అలాగే డిస్నీ హాట్ స్టార్ లో నా ఫ్రెండ్ సపోర్ట్ చేశాడు. అనురాధ గారికి సబ్జెక్ట్ నచ్చి వెబ్ సిరీస్ టేకప్ చేశారు. నేను అతిథి కథ చెప్పింది ఫస్ట్ వేణుగారికే. ఆయన ఒక కొత్త యాక్టర్ లా ఈ వెబ్ సిరీస్ చేశాడు. అతిథిలో హారర్, థ్రిల్లర్ అంశాలుంటాయి. ప్రతి ఏపిసోడ్ ట్విస్టులతో సాగుతుంది. ఫ్యామిలీ అంతా చూసే వెబ్ సిరీస్ ఇది. అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సియా గౌతమ్, హీరో వేణు తొట్టెంపూడి , యాక్టర్ రవివర్మ, యాక్టర్ వెంకీ కాకుమాను, సినిమాటోగ్రాఫర్ మనోజ్, మ్యూజిక్ డైరెక్టర్ కపిల్, హీరోయిన్ అవంతిక మిశ్రా తదితరులు పాల్గొన్నారు.