రష్యాకు తమ దేశం నుంచి పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని, రష్యాది న్యాయపోరాటమే అని ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జింగ్ ఉన్ తెలిపారు. రష్యాకు కిమ్ తనదైన ప్రత్యేక రైలులో రహస్యంగా వచ్చారు. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి కిమ్ రష్యా సుదూర తూర్పు ప్రాంతంలోని యుద్ధ సన్నాహాక లాంఛ్ ప్యాడ్‌ను సందర్శించారు. రష్యాది తమది సామ్రాజ్యవాద వ్యతిరేక కూటమి జట్టు అని, తాము ఎప్పుడూ రష్యాకు మద్దతు అందిస్తామని కిమ్ చెప్పినట్లు వెల్లడైంది. ఉక్రెయిన్‌పై దాడుల తరువాత అంతర్జాతీయంగా రష్యా పలు ఆంక్షలకు గురైంది. అంతేకాకుండా అంతర్జాతీయ సమావేశాలకు పుతిన్ హాజరుకావడం లేదు. యుద్ధ నేరాలకు సంబంధించి ఆయనపై వెలువడ్డ అరెస్టు వారంటు వల్ల పుతిన్ కేవలం రష్యాకు పరిమితం అయ్యారు.
ఈ దశలోనే ఉత్తరకొరియా అధినేత కిమ్ రష్యాకు వచ్చారు. రిమోట్ స్పేస్‌బేస్‌లో ఇరువురు పరిస్థితిని పర్యవేక్షించారు. రష్యాకు ఉత్తరకొరియా నుంచి పూర్తిస్థాయి , బేషరతు మద్దతు ఉంటుందని కిమ్ తెలిపారు. ఇరువురి నేత శిఖరాగ్ర సదస్సు వోస్టోచ్ని కాస్మోడ్రోమ్ వద్ద జరిగింది. దేశాలు విడిపోతున్న దశలో తమ ప్రయోజనాలకు ఏర్పడుతున్న ఇబ్బందుల దశలో రష్యా ఉక్రెయిన్‌లు మరింతగా దగ్గరవుతున్నాయని ఈ దశలో ఇరువురు నేతలు తెలిపారు. ఇక్కడ ఐదుగంటల పాటు చర్చలు జరిగాయని తెలిసింది. అయితే వీరి కలయిక వల్ల ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం రష్యాకు ఆయుధాల సరఫరా కోసం ఒప్పందం కుదరబోతోందని అమెరికా హెచ్చరించింది.