ప్రఖ్యాత టైమ్ మ్యాగ్జైన్ రూపొందించిన టాప్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తోపాటు మరో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు. టీబీ వ్యాధితో చికిత్స పొందుతూ ఔషధం సెడ్ ఎఫెక్ట్ కారణంగా వినికిడి శక్తి కోల్పోయి, దానిపై పోరాటం చేసిన నందితా వెంకటేశన్, వాల్మేకర్స్ స్టూడియో యాజమాని అయిన వినూ డేనియల్‌కు కూడా జాబితాలో చోటు దక్కింది. భారత మూలాలున్న నబరున్ దాస్ గుప్తా కూడాజాబితాలో స్థానం సంపాదించారు. తన ఫైర్ అండ్ ఫ్లెయిర్ ముద్రతో మహిళా క్రికెట్లో తనదైన ముద్ర వేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ భారత క్రికెట్‌కు లభించిన విలువైన ఆస్తి అని టైమ్ తన ప్రకటనలో పేర్కొంది.