Skip to main content

Namaste NRI

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సాయి పల్లవి.. హీరో ఎవరో తెలుసా..?

సాయిపల్లవి సినిమా అంటేనే సమ్‌థింగ్‌ స్పెషల్‌ అని భావిస్తారు అభిమానులు. ఆమె ఎంచుకునే కథాంశాల్లో తప్పకుండా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. రొటీన్‌ సబ్జెక్ట్స్‌ను నిర్మొహమాటంగా తిరస్కరిస్తుందీ భామ. ఆ కారణంగానే గత ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నది సాయిపల్లవి. ప్రస్తుతం ఆమె తమిళంలో శివకార్తికేయన్‌ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి హిందీ అరంగేట్రానికి రంగం సిద్ధమైందని తెలిసింది. బాలీవుడ్‌ అగ్ర హీరో అమీర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ఖాన్‌తో కలిసి ఈ అమ్మడు ఓ సినిమాలో నటించబోతున్నదని సమాచారం. ప్రేమకథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సునీల్‌పాండే దర్శకత్వం వహించబోతున్నారని తెలిసింది. నటనతో పాటు నృత్యానికి ప్రాధాన్యం ఉన్న కథాంశం కావడంతో దర్శకుడు సాయిపల్లవి వైపు మొగ్గుచూపారని బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్నది.

Social Share Spread Message

Latest News