Namaste NRI

ఉస్తాద్ భగత్ సింగ్ హైదరాబాద్‌ షెడ్యూల్

పవన్‌కల్యాణ్‌ తన తాజా చిత్రం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నది.   మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  హైదరాబాద్‌లో జరుగుతున్న నాన్‌స్టాప్‌ షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్‌ స్టిల్స్‌లో పవన్‌కల్యాణ్‌ ఖాకీ దుస్తుల్లో యాక్షన్‌ మోడ్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టిల్స్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజా షెడ్యూల్‌లో యాక్షన్‌ ఘట్టాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ  చిత్రంలో  అశుతోష్‌ రాణా, నవాబ్‌షా, గౌతమి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే: కె.దశరథ్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్‌ ఎస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events