Namaste NRI

నయనతార గాడ్‌ సెన్సార్‌ కంప్లీట్‌

జయం రవి, నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం ఇరైవన్‌ తెలుగులో గాడ్‌ పేరుతో ప్రేక్షకుల ముందుకురానుంది. ఐ.అహ్మద్‌ దర్శకత్వం. సుధన్‌ సుందరం, టి.జయరాం, సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ నిర్మించారు. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్‌ 13న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ   క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశమిది. హత్యా రహస్య శోధన చుట్టూ కథ నడుస్తుంది. అనుక్షణం ఉత్కంఠను పంచుతుంది. నయనతార పాత్ర చిత్రణ పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. జయం రవి, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన తని ఒరువన్‌  భారీ విజయం సాధించింది. అదే స్థాయిలో ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ  చిత్రంలో వినోద్‌ కిషన్‌, రాహుల్‌ బోస్‌, విజయలక్ష్మి, నరైన్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం, సంగీతం: యువన్‌శంకర్‌రాజా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events