Skip to main content

Namaste NRI

వృషభ కొత్త షెడ్యూల్ ముంబైలో

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, మోహన్ లాల్  ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం వృషభ. ది వారియర్ అరైజ్ అనేది ట్యాగ్‌లైన్. శనయ కపూర్‌, జహ్రా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నంద కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా,  అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించేలా మేకర్స్ సన్నాహాలు చేశారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.  ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు.  దసరా రోజున ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. 

Social Share Spread Message

Latest News