రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తున్న చిత్రం కేసీఆర్ (కేశవ్ చంద్ర రమావత్). కథానాయిక అనన్య, గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. విభూది క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా టైటిల్‌తో పాటు 50 అడుగుల భారీ కటౌట్‌ను మల్లారెడ్డి యూనివర్సిటీలో మంత్రి మల్లా రెడ్డి ఆవిష్కరించారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణలోని గిరిజన తండా నేపథ్యంలో జరిగే కథ ఇదని చిత్ర బృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, కృష్ణభగవాన్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, రచ్చ రవి, జోర్దార్ సుజాత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం: కాసర్ల శ్యామ్, గోరటి వెంకన్న, చరణ్ అర్జున్, ఆర్ట్: బత్తుల మహేష్, రచన: నవీన్ కోలా, రాకింగ్ రాకేశ్, నిర్మాణం: గ్రీన్ టీ ప్రొడక్షన్స్, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: గరుడవేగ అంజి.














