Skip to main content

Namaste NRI

సైంధవ్ టీజర్ వచ్చేసింది

అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌  హీరోగా రూపొందుతున్న చిత్రం సైంధవ్‌. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధాశ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాశ్‌ కీలక భూమికలు పోషిస్తు న్నారు. ఈ చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకుడు. వెంకట్‌ బోయినపల్లి నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడారు. రొటీన్‌గా కాకుండా ఏదైనా కొత్త కథ చేయాలని చూస్తున్న సమయంలో శైలేశ్‌ సైంధవ్‌ కథ చెప్పాడు. ఈ కథలో భావోద్వేగాలకు ఎంత స్కోప్‌ ఉందో, యాక్షన్‌కి కూడా అంతే స్కోప్‌ ఉంది అన్నారు.  ఇందులో నా పాత్ర కథరిత్యా వైల్డ్‌గా ఉంటుంది. మాస్‌ ప్రేక్షకులకేకాక, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చే సినిమా ఇది అని వెంకటేశ్‌ నమ్మకం వ్యక్తం చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన వెంకటేశ్‌గారి 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్‌గారికి కృతజ్ఞతలు. మహాభారతంలో సైంధవుడు ధర్మానికి ఒక్కరోజు అడ్డు నిలిచాడు. నా సైంధవుడు అధర్మాన్ని అడ్డునిలుస్తాడు. అది ఎలాగనేదే ఈ సినిమా కథ  అన్నారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ మాట్లాడుతూ  అన్నయ్యలాంటి వెంకటేశ్‌గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని  అన్నారు.

Social Share Spread Message

Latest News