వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడారు. ఈ పొలిటికల్ సీజన్‌లో రావాల్సిన సినిమా ఇది. ఇందులో ఎవర్నీ విమర్శించ లేదు. రాజకీయాల వల్ల జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని కామెడీగా చెప్పడం జరిగింది అంతే. ఇందులో వారసత్వంగా వస్తున్న గ్రామసర్పంచ్ పదవికోసం తపించే వ్యక్తిగా కనిపిసా అని చెప్పారు. ఈ చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.














