Skip to main content

Namaste NRI

బీజింగ్‌లో పుతిన్‌ కు భంగపాటు.. ఐరోపా ప్రతినిధులు వాకౌట్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కు భంగపాటు ఎదురైంది. పుతిన్‌  ప్రసంగం మొదలుపెట్టగానే ఐరోపా ప్రతినిధులు వాకౌట్‌ చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో ఈ సంఘటన జరిగింది. అతిపెద్ద దౌత్య కార్యక్రమాన్ని చైనా నిర్వహించింది. బెల్ట్, రోడ్  ప్రాజెక్ట్, బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధ్యక్షతన బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్స్‌లో జరిగిన చైనా సమ్మిట్‌కు ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు.

 ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి బయటకు రాని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ ఈ ఏడాది తొలిసారి చైనాను సందర్శించారు. అణ్వాయుధాల ప్రయోగానికి సంబంధించిన బ్రిఫ్‌ కేస్‌ను తన వెంట తీసుకెళ్లిన ఆయన చైనా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. సమ్మిట్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాట్లాడిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రసంగించారు. అయితే ఆయన మాట్లాడటం మొదలుపెట్టగానే యూరోపియన్‌ ప్రతినిధులు వాకౌట్‌ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు నిరసనగా శిఖరాగ్ర సమావేశం హాల్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు.

Social Share Spread Message

Latest News