Namaste NRI

కంసరాజు ఉగ్రరూపం.. ఫస్ట్‌లుక్‌ విడుదల

మహేష్‌బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా కథానాయకుడిగా అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది.   వారణాసి మానస కథానాయికగా నటిస్తున్నారు. ప్రశాంత్‌వర్మ కథనందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దేవదత్త నాగే కంసరాజు అనే పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఇందులో ఆయన చేతిలో కత్తి పట్టుకొని కంసరాజు తన ఉగ్రరూపం చూపిస్తున్న స్టిల్‌ అది.  భాగవతంలోకి ఓ ఘట్టాన్ని నేటి కాలానికి అన్వయిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. కథ, కథనాలు కొత్తదనంతో ఆకట్టుకుంటాయి. అశోక్‌ గల్లా పాత్ర నవ్యరీతిలో సాగుతుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, దర్శకత్వం: అర్జున్‌ జంధ్యాల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events