Skip to main content

Namaste NRI

రామ్ పోతినేని విడుదల చేసిన దీపావళి ట్రైలర్

తమిళ సినిమా కిడ  తెలుగులో దీపావళి పేరుతో అనువాదమవుతున్నది. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్‌ నిర్మించిన తొలి తమిళ చిత్రమిది. పూ రాము, కాళీ వెంకట్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్‌.వెంకట్‌ దర్శకుడు. దీపన్‌, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర హీరో రామ్‌ పోతినేని విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిది. తాత, మనవడు, ఓ మేక మధ్య ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరిస్తుంది. దీపావళి పండక్కి కొత్త బట్టలు కొనివ్వాలని మనవడు కోరడంతో మేకను అమ్మడానికి సిద్ధపడతాడు తాత. మొక్కు ఉన్న మేక కావడంతో దానిని కొనడానికి ఎవరూ ముందుకురారు. ఈ నేపథ్యంలో కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్‌లో సహజత్వం కనిపిస్తుంది  అని నిర్మాత స్రవంతి రవికిషోర్‌ తెలిపారు.  ఈ చిత్రం నవంబర్‌ 11న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News