Namaste NRI

కార్తీ జపాన్ ట్రైలర్ రిలీజ్

కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జపాన్‌. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక.   రాజు మురుగన్‌ దర్శకుడు. ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మాతలు. ఈ చిత్రంలో సునీల్‌, విజయ్‌ మెల్టన్‌ ఇతర పాత్రలు పోషించారు.  ట్రైలర్‌ లాంచ్‌ చెన్నయ్‌లో గ్రాండ్‌గా జరిగింది. సూర్య, విశాల్‌, తమన్నా, ఆర్య, జయం రవి, లోకేశ్‌ కనకరాజ్‌, పా.రంజిత్‌ తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇందులో కార్తీ బంగారు ఆభరణాలు కాజేసే దొంగగా కనిపిస్తారని, ఆయన నటన అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునే రీతిలో ఉంటుందని, వాణిజ్యహంగులతో పాటు ఆద్యంతం హాస్య ప్రధానంగా అలరిస్తుందని మేకర్స్‌ తెలిపారు.  ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.రవివర్మన్‌, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events