Skip to main content

Namaste NRI

దేవరలో జాన్వీకపూర్‌ ఫస్ట్‌లుక్‌

 ఎన్టీఆర్  కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దేవర.  జాన్వీకపూర్‌ కథానాయిక. ఈ సినిమా తో జాన్వీకపూర్‌  తెలుగులో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. కొన్ని మాసాల క్రితం విడుదల చేసిన జాన్వీకపూర్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అందరిలో ఆసక్తిని పెంచింది. తాజా సమాచారం ప్రకారం కథాగమనంలో జాన్వీకపూర్‌ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, రెండు భిన్న పార్శాలు కలిగిన క్యారెక్టర్‌లో ఆమె కనిపిస్తుందని చెబుతున్నారు. సినిమా ద్వితీయార్థంలో జాన్వీకపూర్‌ పాత్ర నెగెటివ్‌ షేడ్స్‌తో సాగుతుందని, ఆమె అలా ఎందుకు మారాల్సి వచ్చిందనే అంశం కథలో కీలకంగా ఉంటుందని అంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే గోవాలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. త్వరలో కర్ణాటకలో కొత్త షెడ్యూల్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

Social Share Spread Message

Latest News