Skip to main content

Namaste NRI

రోటి కపడా రొమాన్స్‌ టైటిల్‌ లోగోను ఆవిష్కరించిన దిల్‌రాజు

హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రోటి కపడా రొమాన్స్‌. విక్రమ్‌ రెడ్డి దర్శకుడు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. ఈ  చిత్రంలో నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్భూ చౌదరి తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్ర టైటిల్‌ లోగోను అగ్ర నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టైటిల్‌తో నేనొక రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తీద్దామనుకున్నా. అయితే తమ సినిమా కథకు బాగా సరిపోదుతుందని చెప్పడంతో టైటిల్‌ ఇచ్చేశాను.కొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, నేటి యువతకు బాగా కనెక్ట్‌ అవుతుందని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్‌ రెడ్డి, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, ఆర్‌.ఆర్‌.ధృవన్‌, వసంత్‌ జి, నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ బొజ్జం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్‌రెడ్డి.

Social Share Spread Message

Latest News