Skip to main content

Namaste NRI

ఘనంగా అమలాపాల్ వివాహం

అమలాపాల్‌ రెండో పెళ్లికి రెడీ అయినట్టు ఇటీవలే అప్‌డేట్ వచ్చింది. అమలాపాల్‌ లాంగ్‌ టైమ్‌ బాయ్‌ఫ్రెండ్‌, టూరిజం, హాస్పిటాలిటీ ప్రొఫెషనల్‌ జగత్‌ దేశాయ్ ‌‌తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. కోచిలో జరిగిన వెడ్డింగ్‌ ఈవెంట్‌లో అమలాపాల్-జగత్‌ దేశాయ్‌ ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇటీవలే బర్త్‌ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా అమలాపాల్‌కు జగత్‌ దేశాయ్ వెడ్డింగ్ ప్రపోజల్‌ పెట్టాడు. అంతేకాదు అమలాపాల్ ఎంగేజ్‌మెంట్‌ వైబ్స్‌కు సంబంధించిన స్టిల్స్‌ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. అందరూ కలిసి జీవితకాలం కలిసే జీవించే వేడుకను మొదలుపెట్టిన పార్టీ నుంచి మా ప్రేమ కథ చిగురిస్తుంది.. అంటూ అమలాపాల్‌ షేర్ చేసిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.  కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అమలాపాల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మూవీ లవర్స్‌, అభిమానులు.

Social Share Spread Message

Latest News