నాని, మృణాళ్ ఠాకూర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం హాయ్ నాన్న. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని 30 గా తెరకెక్కుతున్న ఈ మూవీకి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో హాయ్ నాన్న ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది నాని టీం. హైదరాబాద్‌లో జరిగిన అమ్మాడి సాంగ్ లాంఛ్ ఈవెంట్లో మృణాళ్ ఠాకూర్ మాట్లాడుతూ తన పాత్రలో సులభంగా జీవించేసేలా సాయం చేసిన న్యాచురల్ స్టార్ అంటూ నానిని పొగడ్తలతో ముంచెత్తింది. హాయ్‌నాన్న పోషించిన పాత్ర తన కెరీర్లో ఉత్తమమైనదిగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేసింది. నా పాత్రలో చాలా పార్శ్వాలతోపాటు లోతైన భావోద్వేగాలుంటాయి. ఓ యాక్టర్‌గా నేనేం చేయగలనో ఈ సినిమాలో చూస్తారు. బేబి కియారా చాలా కీలక పాత్రలో నటించింది. నాకు, బేబి కియారాకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా భావోద్వేగపూరితంగా ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇప్పటికే హాయ్ నాన్న నుంచి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన సమయమా సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ, మ్యూజిక్ లవర్స్‌ను ఫిదా చేస్తోంది. ఈ చిత్రానికి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.














