Skip to main content

Namaste NRI

కోట బొమ్మాళి పీఎస్‌ చాలా సంతృప్తినిచ్చిన కథ:  అల్లు అరవింద్‌  

రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా, శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం కోట బొమ్మాళి పీఎస్‌. గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. తేజ మార్ని దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ లాంచ్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి అతిథిగా హాజరై మాట్లాడారు.  ఈ సినిమా ఒరిజినల్‌ చూశాను. ఇందులో చాలా మార్పులు చేశారు. గన్‌ గవర్నమెంట్‌ది వేలు మనది అన్న డైలాగ్‌ నాకు బాగా నచ్చింది. శ్రీకాంత్‌గారిని రియలిస్టిక్‌ క్యారెక్టర్‌లో చూసినందుకు ఆనందంగా ఉంది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌ మంచి పాత్రల్లో కనిపించబోతున్నారు. అల్లు అరవింద్‌ ధోనీ లాంటి వారు. వెనుక ఆయన ఉన్నారు కాబట్టే బన్నీ వాసు, ఎస్‌కేఎన్‌ బాగా ఆడేస్తున్నారు. ఇప్పుడు విద్యాగారు వస్తున్నారు. ఆమె కూడా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా అన్నారు.  

అల్లు అరవింద్‌  మాట్లాడుతూ  పోలీసులను రాజకీయనాయకులు ఎలా వాడుకుంటున్నారనే దానిపైనే ఈ సినిమా ఉంటుంది. పోలీసులు పడే బాధలు, ఇబ్బందులు ఇందులో ఉంటాయి. సంతృప్తినిచ్చిన కథ ఇది. యూనిట్‌ మొత్తానికి శుభాకాంక్షలు అందిస్తున్నా అని అన్నారు. దర్శకుడు  మాట్లాడుతూ నేరస్తుల్ని పట్టుకోవాల్సిన పోలీసులే కేసులో ఇరుక్కొని కష్టాలు పడితే? అనే అంశాన్ని తీసుకొని తెరకెక్కించిన సినిమా ఇదని, అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలని అన్నారు.

Social Share Spread Message

Latest News