Namaste NRI

బైడెన్ నోట మళ్లీ అదే మాట..అవును ఆయన ఓ నియంతే!

 అమెరికా, చైనా అధ్యక్షులు చాలా కాలం తర్వాత తొలిసారి సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ నియంత  అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. వారిద్దరి సమావేశం తర్వాత జో బైడెన్‌ మీడియాతో మాట్లాడారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఇంకా నియంతగా కనిపిస్తున్నారా? అని మీడియా జర్నలిస్టులు ప్రశ్నించారు. దీనికి అవును. ఆయన అలాగే కనిపిస్తున్నారు అని బైడెన్‌ సమాధానమి చ్చారు. కమ్యూనిస్ట్ దేశాన్ని పాలించే వ్యక్తి అనే అర్థంలో ఆయన డిక్టేటర్‌ అని అన్నారు. ఎందుకంటే మన ప్రభుత్వం కంటే చైనా ప్రభుత్వం పూర్తిగా భిన్నమైనదని బైడెన్‌ వ్యాఖ్యానించారు.

అమెరికా, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న సుమారు నాలుగేళ్ల తర్వాత ఇరు దేశాల అధ్యక్షులు ప్రత్యేకం గా సమావేశమయ్యారు. అమెరికాను సందర్శించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో కాలిఫోర్నియాలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమ్మిట్‌లో  ద్వైపాక్షిక సంబంధాలతోపాటు పలు అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారం, సంబంధాలు గాడి తప్పకుండా ఉండేలా కృషి చేసేందుకు అమెరికా, చైనా అంగీకరించాయి. మిలిటరీ స్థాయి చర్చల పునరుద్ధరణపై కూడా ఇరు దేశాలు సమ్మతి తెలిపాయి. అలాగే అమెరికాలో అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి చైనా అంగీకరించినట్లు అమెరికా పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events