గల్ఫ్ కార్మికుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బీమా ప్రకటించడంతో గల్ఫ్ దేశాలలో నివాసం ఉండే తెలంగాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మహిపల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 85-100 సీట్లతో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి బూటకపు వాగ్దానాలు చేస్తూ ఢిల్లీ నాయకులకు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ప్రజలను గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. కారు గుర్తుకి ఓటు బీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలి అంటే రాష్ట్ర అభివృద్ధి పై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ మన రాష్ట్రానికి నాయకత్వం వహించాలన్నారు. అభివృద్ధి పై దశ దిశ లేని ఇతర పార్టీ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)