Skip to main content

Namaste NRI

కలశ ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేసిన గోపిచంద్ మలినేని

భానుశ్రీ, సోనాక్షివర్మ, అనురాగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కలశ. కొండా రాంబాబు దర్శకుడు. చంద్రజ వాడపల్లి నిర్మించారు. జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్ర ట్రైలర్‌ను యువ దర్శకుడు గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని ప్రశంసించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని దర్శకుడు తెలిపారు. నేటి యువత, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలుంటాయని నిర్మాత పేర్కొన్నారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ గంగధారి, సంగీతం: విజయ్‌ కురాకుల, దర్శకత్వం: కొండా రాంబాబు.

Social Share Spread Message

Latest News