బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్, నేరుగా బంజారాహిల్స్ నంది నగర్‌లోని తన సొంతింటికి వెళ్లారు. హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ కారణంగా కేసీఆర్ యశోద ఆస్పత్రిలో వారం రోజుల పాటు ఉన్నారు. చికిత్స అనంతరం కేసీఆర్ కోలుకోవడంతో, వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మరో నాలుగైదు వారాల పాటు కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే.