సంచలనాలకు కేంద్రమైన చాట్‌జీపీటీకి పోటీగా సెర్చింజన్ గూగుల్ కొత్తగా గూగుల్ జెమిని పేరిట అడ్వాన్స్‌డ్ ఏఐ (కృత్రిమ మేధ ) మోడల్ చాట్‌బోట్‌ను ఆవిష్కరించింది. ఇది టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ తదితర అంశాలపై యూజర్లకు 90 శాతం కచ్చితత్వంతో కూడిన సమాధానాలు అందిస్తుందని గూగుల్ తెలిపింది. జెమిని 1.0 వర్షన్ పేరిట మూడు వేరియంట్లు జెమిని ఆల్ట్రా , జెమిని ప్రో , జెమిని నానోను అందుబాటులోకి తెచ్చామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. శాస్త్రీయ పరిశోధన పత్రాల్లో గ్రాఫ్‌లు, గణాంకాలను రూపొందించే గూగుల్ జెమిని.. విద్యార్థుల రోజువారీ హోంవర్క్‌లోనూ సహాయ పడుతుందని వెల్లడించారు.