Skip to main content

Namaste NRI

హ్యాపీడేస్‌ లాగే  పాషన్‌ ఉంటుంది: శేఖర్‌ కమ్ముల

సుధీష్‌ వెంకట్‌, అంకిత సాహ జంటగా నటిస్తున్న పాషన్‌ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అరవింద్‌ జోషువా దర్శకుడు.  డాక్టర్‌ అరుణ్‌, నరసింహ, ఏ.పద్మనాభ రెడ్డి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల క్లాప్‌నివ్వగా, అరుణ్‌కుమార్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శేఖర్‌ కమ్ముల హ్యాపీడేస్‌ మూవీలా ఈ సినిమా కూడా యువతను ప్రభావితం చేస్తుందన్నారు. దర్శకుడు మాట్లాడుతూ నేను రాసిన పాషన్‌ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కొత్తదనంతో కూడుకున్న కథ ఇది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ నటరాజన్‌, నిర్మాణ సంస్థ: తోలు బొమ్మలాట ఫిల్మ్స్‌, రచన-దర్శకత్వం: అరవింద్‌ జోషువా.

Social Share Spread Message

Latest News